![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -129 లో....తన తల్లి పై నిందలు ఇంకోసారి వేసి తనని నన్ను బాధపెట్టకని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత మా అమ్మ సీత అన్నయ్య సవతి తల్లి అయిన కూడా మాకంటే ఎక్కువగా అన్నయ్యనే ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు అమ్మని అవమానించినందుకు నాకు బాధగా ఉంది వదిన అని సిరి అంటుంది. నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావ్ మారొక్కసారి ఇలాంటివి రీపీట్ అవ్వనివ్వకని పెద్దాయన అంటాడు. నువ్వు మా అమ్మని అవమానిస్తావా తల్లీ కొడుకులని దూరం చెయ్యాలని అనుకుంటున్నావా అని సందీప్ అంటాడు. దేవత లాంటి అత్తయ్య ని అపార్థం చేసుకుంటావా అని శ్రీవల్లి అంటుంది. నిజానిజాలు తెలుసుకోకుండా బావకి కోపం తెప్పించే పనులు చెయ్యకని ధన అంటాడు. ఇలా అందరు రామలక్ష్మిది తప్పన్నట్లు మాట్లాడతారు.
ఆ తర్వాత శ్రీలత చేతికి డాక్టర్ ట్రీట్ మెంట్ చేస్తుంది. రామలక్ష్మి భయం లో ఉంది. అందుకే తను ఇలా మాట్లాడింది. తన మాటలు మనసు లో పెట్టుకోవద్దు.. మాపై కోపం పెంచుకోవద్దని శ్రీలతకి సందీప్ చెప్తాడు. చూసారా మనం ఆడిన నాటకంతో తనకి మన గురించి తెలిసిపోయిందని ఎలా బయటపడిందో.. ఇకనుండి మనం చాలా జాగ్రత్త గా ఉండాలని అని సందీప్, శ్రీవల్లీలతో శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వచ్చి.. నువ్వు అన్న మాటలు మా అమ్మ తట్టుకోలేకపోతుంది ప్లీజ్ ఇంకోసారి ఇలా రీపీట్ కానివ్వకని చెప్పి వెళ్తాడు. ఆవిడా నిజస్వరూపం మీకు త్వరలోనే తెలిసేలా చేస్తానని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఇక నుండి రామలక్ష్మి సైలెంట్ గా ఉండదు. నా నిజస్వరూపాన్ని సీతకి ఆధారాలతో తెలియజేసే పనిలో ఉంటుందని సందీప్ తో శ్రీలత చెప్తుంది.
మరొకవైపు సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్లినా కూడా ఇంట్లో జరిగిన విషయాన్ని గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత మాణిక్యం వచ్చి విసిగిస్తుంటే తనపై కోప్పడుతాడు. ఆ తర్వాత ఎందుకు అల్లుడు కోపంగా ఉన్నాడో ధనని అడిగి కనుక్కుంటాడు మాణిక్యం. దాంతో ధన జరిగింది మొత్తం మాణిక్యానికి చెప్తాడు. శ్రీలత గురించి రామలక్ష్మికి డౌట్ వచ్చినట్లుంది. అందుకే అలా చేసింది శ్రీలతతో రామలక్ష్మిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలని మాణిక్యం అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీవల్లిని క్యారేజ్ రెడీ చేయమని శ్రీలత చెప్తుంది. సీత తీసుకొని వెళ్తాడు. ఈ చిన్న గొడవకే రామలక్ష్మి క్యారేజ్ తీసుకొని రాలేదని సీతాకాంత్ అనుకుంటాడు. దాంతో ఇద్దరికి గొడవ జరుగుతుందని శ్రీవల్లితో శ్రీలత చెప్తుంది. శ్రీవల్లి క్యారేజ్ రెడీ చేస్తుంటే.. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |